ముంబై ఇరానీ కేఫ్‌ల వెనుక 'వాస్తు' రహస్యం.. మూల మలుపుల్లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
- ముంబైలోని పాత ఇరానీ కేఫ్‌లు అన్నీ వీధుల మూలల్లోనే
- ఈ మూల స్థలాలు వ్యాపారాలకు అరిష్టమని భావించిన స్థానిక హిందువులు
- వాస్తునమ్మకాల వల్ల ఎవరూ కొనకపోవడంతో తక్కువ ధర
- ఆ నమ్మకాలను పట్టించుకోకుండా కొనుగోలు చేసిన వలస వచ్చిన ఇరానీలు
- కాలక్రమేణా ఐకానిక్‌గా మారిన కేఫ్‌లు
ముంబై నగర సంస్కృతిని, ఇక్కడి జీవనశైలిని ప్రతిబింబించే వాటిలో 'ఇరానీ కేఫ్‌లు' మొదటి వరుసలో ఉంటాయి. దక్షిణ ముంబై (South Bombay) వీధుల్లో నడుస్తుంటే ఘుమఘుమలాడే ఇరానీ చాయ్, తాజా మావా కేక్స్, బ్రన్-మస్కాల సువాసనలు మనల్ని పలకరిస్తాయి. అయితే, ఈ కేఫ్లన్నింటినీ గమనిస్తే ఒక విచిత్రమైన పోలిక కనిపిస్తుంది. ముంబైలోని పాతకాలపు ఇరానీ కేఫ్‌లు దాదాపు అన్నీ వీధుల కూడళ్లలో లేదా మూల మలుపుల్లో (Street Corners) మాత్రమే ఉంటాయి. దీని వెనుక కేవలం వ్యాపార వ్యూహం మాత్రమే కాదు, ఒకప్పటి భారతీయ 'వాస్తు శాస్త్ర' నమ్మకాలతో ముడిపడిన ఆసక్తికరమైన చరిత్ర ఉంది.
19వ శతాబ్దం చివరిలో ఇరాన్ దేశంలో తీవ్ర కరువు, మతపరమైన అణచివేత కారణంగా వేలాది మంది ఇరానీలు బొంబాయి (ప్రస్తుత ముంబై) నగరానికి వలస వచ్చారు. చాలా పరిమితమైన ఆర్థిక వనరులతో వచ్చిన వీరు, ఇక్కడ బ్రతకడం కోసం చిన్న చిన్న చాయ్ హోటళ్లు పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆ సమయంలో నగరంలో వాణిజ్య స్థలాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో వారికి సాధారణ ప్లాట్లు కొనడం సాధ్యపడలేదు. సరిగ్గా అదే సమయంలో స్థానిక వ్యాపారులలో ఉన్న వాస్తు నమ్మకాలు ఈ ఇరానీ వలసదారులకు వరంగా మారాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం వీధుల చివరన ఉండే త్రిభుజాకార ప్లాట్లు లేదా "సింహ ముఖ" (ముందు వెడల్పుగా, వెనుక ఇరుగ్గా ఉండే) ప్లాట్లు వ్యాపారాలకు కలిసి రావని, అవి అరిష్టమని నాటి హిందూ వ్యాపారులు నమ్మేవారు. దీంతో ఆ మూల స్థలాలను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో యజమానులు వాటిని చాలా తక్కువ ధరలకే విక్రయించేవారు. మన దేశ ఆచారాలు, వాస్తు నమ్మకాలపై పెద్దగా అవగాహన లేని ఇరానీలు.. ఆ చౌక స్థలాలను అందిపుచ్చుకుని కేఫ్‌లను నిర్మించారు.
అయితే వాస్తు ప్రకారం అరిష్టమనుకున్న ఆ మూల ప్లాట్లే కాలక్రమేణా ఇరానీ కేఫ్‌ల విజయానికి ప్రధాన కారణమయ్యాయి. నాలుగు వీధులు కలిసే జంక్షన్లలో ఇవి ఉండటం వల్ల అన్ని వైపుల నుంచి వచ్చే మిల్లు కార్మికులు, టాక్సీ డ్రైవర్లు, రేవు కూలీలు, విద్యార్థులకు ఇవి సులువుగా కనిపించేవి. వ్యాపారానికి అద్భుతమైన విజిబిలిటీ లభించడంతో 'క్యానీ అండ్ కో', 'సస్సానియన్', 'బ్రిటానియా', 'కేఫ్ మిలిటరీ' వంటి కేఫ్‌లు ముంబై నగర చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. నాడు మూలల్లో విసిరేసినట్లు ఉన్న ఆ స్థలాలు.. నేడు ముంబై నైరుతి సంస్కృతికి, నోస్టాల్జియాకు కేంద్ర బిందువులుగా మారడం ఒక మధురమైన వైరుధ్యం.